రూ.5.12 కోట్లతో వ్యవసాయ యంత్ర పరిక రాలు

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. యంత్ర పరికరాల కొనుగోలు కోసం జిల్లాకు ఈ ఏడాది రూ. 5.12 కోట్లు కేటాయించింది. రైతులకు గరిష్టంగా 50 శాతం సబ్సిడీపై వీటిని అధికారులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌లో మంగళవారం ప్రారంభమైంది. రైతుల నుంచి విశేష స్పందన వస్తే లాటరీ పద్ధతిలో యంత్ర పరికరాలను కేటాయించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్‌, జేసీ, వ్యవసాయశాఖ జేడీలతో ఏర్పాటు కానున్న ప్రత్యేక కమిటీ లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనుంది.