రూ.72 వేలు చెల్లిస్తే.. 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూ

అమెరికా వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం నెలల తరబడి నిరీక్షించే రోజులకు చెక్ పెట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్న కొత్త ప్రీమియం సర్వీస్ ద్వారా అదనపు రుసుము చెల్లించి కేవలం 10 రోజుల్లోనే ఇంటర్వ్యూ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా 750 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.72 వేలు) అదనంగా చెల్లిస్తే చాలు 10 రోజుల్లోనే ఇంటర్వ్యూను పొందవచ్చు. కఠినమైన వలస నిబంధనల కారణంగా వీసా ప్రాసెసింగ్ ఆలస్యమవుతున్న తరుణంలో.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది.