స్కూల్లో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు: టీచర్ సహా 9 మంది దుర్మరణం,13 మందికి గాయాలు

టర్కీలో దారుణం జరిగింది. ఓ 14 ఏళ్ల బాలుడు తుపాకీతో స్కూల్లో కాల్పులకు తెగబడ్డాడు. తాను చదువుకుంటున్న స్కూల్‌లోనే తుపాకీతో తోటిమిత్రులపై కాల్పులు జరిపాడు. రెండు రోజుల క్రితం ఓ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన మరువకముందే మరో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది తోటి విద్యార్థులతోపాటు ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో దారుణం జరిగింది.8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి తన తండ్రికి చెందిన ఐదు తుపాకులతో స్కూల్‌లోకి ప్రవేశించాడు. రెండు తరగతి గదుల్లోకి వెళ్లి కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా సిఫ్త్సీ ధ్రువీకరించారు., News News, Times Now Telugu