16 ఏళ్ల బాలుడు తమపైకి ఇటుక విసిరాడని.. కాల్చి చంపిన సైనికులు

వెస్ట్ బ్యాంక్‌లో 16 ఏళ్ల పాలస్తీనా బాలుడిని కాల్చి చంపిన ఘటనలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలింది. ఒక ఉగ్రవాది మాపైకి ఇటుక విసిరాడు. అందుకే కాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టాం అని సైన్యం తొలుత ప్రకటించినప్పటికీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన సిసిటివి ఫుటేజ్ మరో భయంకరమైన నిజం బయటపడింది. ఓ మీడియా సంస్థ సేకరించిన ఆ వీడియోలో సదరు బాలుడి చేతిలో ఎలాంటి వస్తువు లేకపోవడమే కాకుండా, అతడు నడుచుకుంటూ వీధి మలుపు తిరుగుతుండగానే సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.