సొంతింటి కల నెరవేరుతుందని అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి డిపాజిట్లు చెల్లించిన పేదలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పునాది దశలో ఉన్న టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా వారు చెల్లించిన డిపాజిట్లనూ తిరిగివ్వలేదు. రద్దయిన వారికి డిపాజిట్లు తిరిగివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఈఏడాది మేలో వివరాలను సేకరించింది. ఇప్పుడు వారికి డిపాజిట్లు తిరిగిస్తున్నారు. వైసీపీ దుశ్చర్యతో సుమారు 8 ఏళ్ల తర్వాత డిపాజిట్ మాత్రమే వారికి దక్కుతోంది.