మునుపెన్నడు లేని విధంగా భానుడు భగభగ మండుతున్నాడు. ఆదివారం జిల్లా అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలోనే జిల్లాలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలలోని రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత 15 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు.