kumaram bheem asifabad- కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

సింగరేణి కార్మికుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రక్చర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నీ విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ ఎస్‌ తిరుపతి మాట్లాడుతూ కార్మిక వాడల్లో తాగునీటి పైపులైన్ల ఆఽధునీకరణ, కార్మికులకు క్వార్టర్ల కేటాయింపు, ప్రమోషన్ల మంజూరు, బొగ్గు రవాణాలో భధ్రత, కమ్యూనిటీ హాల్‌ మౌలిక వసతులు, పారిశుద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకవచ్చారు.