క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే టెండర్లు ఖరారు, మంత్రి పొంగులేటి కీలక అప్డేట్

తెలంగాణలో క్యూర్‌ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో తొలి విడతగా ప్రతి సెగ్మెంట్‌లో 500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్‌ఐజీ వర్గాల ఇళ్ల నిర్మాణం, సబ్‌ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, ధరణి పోర్టల్‌ అక్రమాలపై జరుగుతున్న విచారణను సమీక్షించిన మంత్రి.. రైతుల భూముల భద్రతకు భూభారతి పోర్టల్‌లో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.