కర్ణాటకలో ఘోరం: జ్యూస్‌లో ఎలుకల మందు, గాజు ముక్కలు కలిపి భార్యను చంపిన భర్త.. ఎందుకంటే?

వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళతోనే జీవితం కొనసాగించాలని చూసిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యనే అత్యంత దారుణంగా కడతేర్చాడు. ముఖ్యంగా అధిక మాసం పేరుతో ప్రత్యేక పూజలు చేయాలని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు. దర్శనం చేసుకుని ఇంటికొచ్చేటప్పుడు.. ఎలుకల మందు, గాజుముక్కల పొడిని జ్యూస్‌లో కలిపాడు. అది ఆలయ ప్రసాదమని చెబుతూ భార్యతో తాగించాడు. అది తాగిన కాసేపటికే.. ఆమె స్పృహ తప్పి పడిపోగా.. రోడ్డు పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆపై రోడ్డుపై ఆమె శవాన్ని పడేసి దాని మీద బైక్ వేశాడు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ నాటకమాడాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.