జిల్లాలో జనగణన ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ జనగణన ప్రక్రియలో చేర్చాలని, ఓటరు జాబితాల్లో చేర్పులు, మార్పులపై బూత్ స్థాయి అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,400 గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియలను ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు.