జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫైనల్ నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Districts Re - Division: ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పునర్విభజనపై నవంబర్ 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యంతరాల గడువు ఇవాళ్టితో (డిసెంబర్ 27) ముగిసింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా. వీటిని సమీక్షించిన తర్వాత డిసెంబర్ 31న ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.