జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరులో ఏ మాత్రం మార్పు లేదు. ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు వచ్చినా దాని నుంచి ‘అదనంగా డబ్బులు ఎలా గుంజాలి?’ అనే దానిపైనే అక్కడి అధికారులు దృష్టి పెడుతున్నారు. వారి చేతిలో ఉన్న ‘పెండింగ్’ అధికారాన్ని అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోయినా, పెద్దలతో సిఫారసు చేయించుకున్నా వారికి చుక్కలు చూపిస్తున్నారు. డాక్యుమెంట్ వివరాలు నమోదు చేసి, కొర్రీలు వేసి ‘పెండింగ్’లో పెట్టేస్తున్నారు. దానిని విడిపించుకోవడానికి సదరు వ్యక్తులు కాళ్లు అరిగేలా తిరగడంతో పాటు ముందు అడిగిన మొత్తానికి మరింత జత చేసి ఇవ్వాల్సి వస్తోంది. జిల్లాలో కీలకమైన ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారే ఫోన్ చేసి చెప్పినా సరే...కొందరు అధికారులు లెక్క చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.