డ్రగ్స్ మాఫియాపై కేరళ సర్కార్ ఉక్కుపాదం.. 'ఆపరేషన్ తూఫాన్'లో చేరిన సూపర్ స్టార్ మోహన్‌లాల్

కేరళలో మాదకద్రవ్యాల మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సమర శంఖం పూరించింది. డ్రగ్స్ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ తూఫాన్ ఉద్యమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ భాగస్వామి కానున్నారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు దశల్లో సాగనున్న ఈ మెగా ఆపరేషన్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, 2,778 మందిని అరెస్ట్ చేశారు. సినీ షూటింగ్ స్పాట్‌లు, డీజే పార్టీలపై కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హోం మంత్రి రమేష్ చెన్నితల సంచలన ప్రకటన చేశారు.