నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తాం...నల్లమల సాగర్‌ద్వారా రాయల సీమకూ నీళ్లు: సీఎం చంద్రబాబు నాయుడు

‘ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు సానుకూలప్రదేశ్‌గా మారుస్తున్నాం. నీటి భద్రత అందరికీ కావాలి..కానీ నీటి సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.‘గతంలో రాయలసీమలోని ఊట కాలువల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవి. రాయలసీమ రాళ్ల సీమగా మారకుండా రతనాల సీమగా మార్చాలని ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు టీడీపీ చూపిన చొరవ కారణంగానే వచ్చాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.‘తెలుగు గంగ రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ చెన్నై దాహార్తిని తీరుస్తోంది. ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య నీటి కోసం విభేదాలు వచ్చిన పరిస్థితి. కావేరీ జలవివాదం అలాంటిదే’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు., News News, Times Now Telugu