నాణ్యమైన విద్యే సమీకృత గురుకులాల లక్ష్యం

కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మిస్తోందని కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని ఊట్కూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం లభ్యత గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.