పంచాయతీల్లో పాత బిల్లుల తిరస్కరణ..ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నిలిచిన చెక్కులు
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు, సామగ్రి సరఫరా చేసిన వెండర్లకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న బిల్లులను ప్రభుత్వం తిరస్కరించింది.