పింఛన్ డబ్బుల కోసం వెళ్తే కోటీశ్వరులయ్యారు.. వృద్ధుడి ఖాతాలో రూ.759 కోట్లు.. కొడుకు ఖాతాలోనూ అంతే!

బ్యాంకింగ్ సర్వర్లలో తలెత్తే సాంకేతిక లోపాలు ఒక్కోసారి సామాన్యులను రాత్రికి రాత్రే ఊహించని విధంగా బిలియనీర్లను చేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన అనుభవమే బీహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా అనే వృద్ధుడికి ఎదురైంది. తన వృద్ధాప్య పింఛన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) కు వెళ్లిన ఆయన.. డబ్బు డ్రా చేసుకున్న తర్వాత తన ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ ఎంతో చూసి చెప్పమనగా.. అందులో ఏకంగా రూ.759 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను కూడా పరిశీలించగా.. అందులోనూ సరిగ్గా రూ.759 కోట్లు బ్యాలెన్స్ దర్శనమిచ్చింది.