మహిళా సంఘాలకు శుభవార్త .. కొత్తగా రుణం తీసుకునే వారికి చక్కటి అవకాశం.. ఇక ఇంటి నుంచే..

మహిళా పొదుపు సంఘాల కోసం ప్రభుత్వం తాజాగా మన స్త్రీనిధి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పాత రుణాల వాయిదాలను పర్యవేక్షించడమే కాకుండా.. కొత్తగా రుణం కావాలనుకునే వారు కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించి.. సమయాన్ని ఆదా చేస్తుంది. సభ్యులు తాము చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయిందో లేదో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారానే సరిచూసుకోవచ్చు. దీనివల్ల నిధుల మళ్లింపు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. తమ ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.