విద్యుత్ వినియోగంలో నయా రికార్డ్: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్... గత రికార్డులన్నీ బ్రేక్

తెలంగాణ రాష్ట్రం మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది.రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం(3/3/26)న ఓ ప్రకటన విడుదల చేశారు.‘ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, మరియు అద్భుత సమన్వయానికి నిదర్శనం అని ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు., News News, Times Now Telugu