సీఎం విజయ్ బాటలోనే నటుడు చేతన్ అహింసా.. కొత్తగా పార్టీ పెడుతూ.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటన

కన్నడ చిత్రసీమలో విలక్షణ నటుడిగా రాణించి, సామాజిక ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న చేతన్ అహింసా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటకలోని సాంప్రదాయ పార్టీల అవినీతిపై సమరం ప్రకటిస్తూ.. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలోని మొత్తం 224 నియోజక వర్గాల్లోనూ ఒంటరిగా అభ్యర్థులను నిలుపుతామని ప్రకటించిన ఆయన.. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తర కర్ణాటక అభివృద్ధిని తమ ప్రధాన ఎజెండాగా మార్చుకున్నారు. గతంలో పలు సామాజిక పోరాటాల వల్ల అరెస్టులు, కేంద్ర ప్రభుత్వం ఓసీఐ హోదా రద్దు వంటి తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్న చేతన్.. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ పార్టీతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ కూటములకు సవాల్ విసరడం సంచలనంగా మారింది.