అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ... స్కిల్డ్ లేబర్‌ను తయారు చేయాలి: కార్మిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

‘అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల మేర ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం కార్మికశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలను, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వేర్వేరు సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు దేశ విదేశాల్లోని ఉపాధి అవకాశాలను దక్కించుకుని అధిక ఆదాయాన్ని ఆర్జించేలా చూడాలని సూచించారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ ను రూపొందించాలని.. వారిలో నైపుణ్యాల స్థాయిని అంచనా వేయాలని ముఖ్యమంత్రి కార్మిక శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించారు., News News, Times Now Telugu