కాంగ్రెస్ వాళ్లు నన్ను చంపేస్తారు అనుకున్నా: బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల ఘర్షణపై మాజీమంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది అని మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.కాంగ్రెస్ వాళ్లు నన్ను కూడా చంపేస్తారు అనుకున్నాను అని వాపోయారు. మా పార్టీ కౌన్సిలర్లతో, మా నాయకుడి ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కావాలని డీజే బండి తెచ్చి ఫుల్ సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేశారు అని మాజీమంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. పాటలు బంజేయండి అని అడిగినందుకు వజ్రేష్ యాదవ్ అనుచరులు తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారని ఆరోపించారు. మీకు ప్రజల్లో మంచి పేరు లేకపోతే మా మీద దాడి చేయడం ఏంటి? అని మాజీమంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు., News News, Times Now Telugu