ఆదివారం షాక్.. భగ్గుమంటున్న చికెన్, కోడి గుడ్ల ధరలు! ప్రస్తుతం కిలో ధర ఎంతంటే..

Chicken Price Today: చికెన్, కోడిగుడ్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే కిలో చికెన్ ధర రూ.250 నుంచి రూ.340కు పెరగగా, ఒక్కో కోడిగుడ్డు ధర రూ.8.50కు చేరుకుంది. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటం, సరఫరా తగ్గిపోవడం, కోళ్ల దాణా ఖర్చులు పెరగడం, ఎల్నినో ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు అమాంతం పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో చికెన్ కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకంజ వేస్తుండగా, హోటళ్లలో బిర్యానీ, చికెన్ కర్రీల డిమాండ్ కూడా తగ్గినట్లు యజమానులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు కూడా పెరిగిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగింది..