రోగుల కష్టాన్ని కొందరు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఆసరాగా మలచుకుంటున్నారు. ఆపద సమయంలో అత్యవసరంగా తరలించకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనను వారు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగిన మొత్తాన్ని చెల్లించలేక, సకాలంలో రోగిని తరలించలేక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యాశతో కూడుకున్న వ్యాపార ధోరణి విడనాడటంలేదని వాపోతున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ కోసం నిత్యం ఎదురవుతున్న ఇబ్బంది ఇది.