"గ్రీన్ కార్డ్ హోల్డర్లపై క్రిమినల్ కేసులు ఉంటే.. దేశం నుంచి బహిష్కరించొచ్చు": యూఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా ఇమ్మిగ్రేషన్ చరిత్రలోనే అత్యంత కీలకమైన మార్పులకు దారి తీసేలా యూఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. నైతిక దుష్ప్రవర్తన, తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారాలను కోర్టు సమర్థించింది. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే శాశ్వత నివాసితులను ఎంట్రీ పాయింట్ల వద్దే అడ్డుకునేందుకు బోర్డర్ ఏజెంట్లకు సుప్రీంకోర్టు తిరుగులేని పవర్‌ను ఇచ్చింది. వలసదారులకు ఇదొక పెద్ద షాక్‌గా నిలిచింది.