బెంగళూరులో హఠాత్తుగా నిలిచిపోయిన మెట్రో.. లారీలు, ట్రక్కులు ఎక్కి ఇళ్లకెళ్లిన ఐటీ ఉద్యోగులు

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పీక్ అవర్స్‌లో నమ్మ మెట్రో పర్పుల్ లైన్ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో.. వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్ మొత్తం గంటలపాటు స్తంభించిపోయింది. ప్రత్యామ్నాయ రవాణా దొరకక, క్యాబ్‌లు, ఆటోలు చేతులెత్తేయడంతో.. లగ్జరీ కార్లలో తిరిగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చివరకు రోడ్లపై వెళ్లే టిప్పర్ లారీలు, ఓపెన్ ట్రక్కులు ఎక్కి ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి టెక్ నిపుణులు నడిరోడ్డుపై లారీలు ఎక్కిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ పాలన అంటూ ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.