ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అమెరికా మాటలు వినకపోతే గుణపాఠం తప్పదంటూ హెచ్చరిక!

ఇరాన్ సుప్రీం నేత అలీ కమేనీని టార్గెట్‌గా చేసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రగడ మొదలైంది. ఇజ్రాయెల్ వ్యాఖ్యలకు ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఇజ్రాయెల్ తమ యజమాని అమెరికా మాట వినకపోతే ఇరాన్ వారికి గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే అమెరికా సహకారం ఉన్నా లేకపోయినా తాము మాత్రం యుద్ధం చేస్తామంటూ ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది.