"బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చేశాం.. 30 మంది పాక్ భద్రతా సిబ్బంది చనిపోయారు': బీఎల్ఏ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌లోని గ్వాదర్ జిల్లాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నరమేధం సృష్టించింది. జివానీ తీర ప్రాంతంలోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఆత్మాహుతి దళం మెజీద్ బ్రిగేడ్ గురువారం సాయంత్రం భీకర దాడికి తెగబడింది. పేలుడు పదార్థాల ట్రక్కుతో క్యాంప్‌ను పేల్చివేసిన అనంతరం.. సాయుధ కమాండోలు లోపలికి చొరబడి జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా పాక్ జవాన్లు బలయ్యారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ పరిధిలోని అత్యంత కీలకమైన ప్రాంతంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.