రాజస్థాన్ శిల్పకళతో జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ కొత్త రూపం.. మోదీ చేతుల మీదుగా ఆధునిక టెర్మినల్ ప్రారంభం

రాజస్థాన్‌లో కొత్త విమాన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోధ్‌పూర్ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ ప్రారంభంతో జోధ్‌పూర్ విమానాశ్రయానికి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్, ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా రూపుదిద్దుకుంది.