ఏపీలో రేపు చారిత్రాత్మక ఘట్టం: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన...క్వాంటం వ్యాలీతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారబోతున్నాయా?

భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి శనివారం వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శనివారం పునాదిరాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ‘క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి 3.00 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు. సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే క్వాంటమ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు., News News, Times Now Telugu