కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య ఏం జరిగింది? విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానం ఇదే..!

శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఒక అనధికారిక సమావేశం జరిగిందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని, ఇవి అధికారిక చర్చలు కావని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ దౌత్య పరిభాషలో 'ట్రాక్-II' సంభాషణలుగా పిలుస్తారు. ఇటువంటి అనధికారిక చర్చలలో.. రాజకీయ ఒత్తిడి లేకుండా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తారు. ఇందులో పదవీ విరమణ చేసిన అధికారులు, శాస్త్రవేత్తలు, పౌర సమాజానికి చెందిన ప్రభుత్వేతర వ్యక్తులు పాల్గొంటుంటారు.