కిలిమంజారో పర్వతంపై కుప్పకూలిన హెలికాప్టర్...ఐదుగురు దుర్మరణం

టాంజానియా లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కిలిమంజారో పర్వతంపై ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పర్యాటకులను రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ బరాఫు క్యాంప్ వద్ద కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందినట్లు టాంజానియా సివిల్ ఏవియేషన్ అథారిటీ(TCAA)ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందింది. మృతుల్లో ఓ గైడ్‌, వైద్యుడు, పైలట్‌, ఇద్దరు విదేశీ పర్యాటకులు ఉన్నట్లు టీసీఏఏ పేర్కొంది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు., News News, Times Now Telugu