ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ వివాదం కారణంగా కారుకు నిప్పు.. బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఇసుక మాఫియా అంతర్గత ఆధిపత్య పోరు భయంకరమైన నరమేధాన్ని సృష్టించింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఇసుక మైనింగ్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వెళ్లిన స్థానిక బీజేపీ నేత భరత్ సింగ్ (లల్లా సింగ్) ప్రత్యర్థుల చేతిలో ఘోర హత్యకు గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారును టిప్పర్ ట్రక్కులతో అడ్డుకుని, తప్పించుకునే దారి లేకుండా లాక్ చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హృదయవిదారక ఘటనలో బీజేపీ నేతతో పాటు మరో ఇద్దరు కారులోనే సజీవ దహనం అవ్వగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.