"నేను చనిపోతే నిన్ను ఎవరు చూస్తారు": కంటిచూపు లేని భార్యను చంపి, వృద్ధుడి ఆత్మహత్య!

వృద్ధాప్యంలో భాగంగా వచ్చిన అనారోగ్య సమస్యలు, భార్యపై ఉన్న మితిమీరిన ప్రేమే ఒక వృద్ధుడి చేత దారుణం చేయించాయి. బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో కంటిచూపు, వినికిడి లోపంతో బాధ పడుతున్న భార్య సుమిత్రా దేవిని ఆమె భర్త నందన్ ప్రసాద్ (83) గొంతునులిమి చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ముందుగా చనిపోతే.. తన భార్యను కొడుకు, కోడలు సరిగ్గా చూసుకుంటారో లేదోనని భయపడే ఆయన ఈ నిర్ణయం తీసుకోగా.. ఈ వార్త ప్రతీ ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తోంది.