పల్లెల్లోనూ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు.. రూ.7 లక్షలు కడితే చాలు, రూ.13 లక్షలు రాయితీ

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 8 ఉమ్మడి జిల్లాల్లోని 35 సంఘాల పరిధిలో వచ్చే నెలలోనే వీటిని ప్రారంభించనున్నారు. రూ.20 లక్షల వ్యయమయ్యే ఒక్కో స్టేషన్‌కు పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద రూ.13 లక్షల రాయితీ లభించనుంది. దీనివల్ల గత రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించబడిన 12,041 ఈవీ వాహనాల వినియోగదారులకు ఛార్జింగ్ సమస్యలు తీరడమే కాకుండా.. సహకార సంఘాలకు అదనపు ఆదాయం సమకూరనుంది.