'భర్త సంపాదనలో 25 శాతం భార్యకు ఇవ్వాల్సిందే': హైకోర్టు కీలక తీర్పు

విడిపోయిన భార్యకు ఇచ్చే భరణం కేవలం ఒక చట్టపరమైన లాంఛనం కాదు.. అది ఆమె గౌరవప్రదంగా జీవించే హక్కు అని అలహాబాద్ హైకోర్టు పునరుద్ఘాటించింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ధరల నేపథ్యంలో భర్త తన నికర ఆదాయంలో 25 శాతం వరకు భార్యకు భరణంగా చెల్లించాలని జస్టిస్ మదన్ పాల్ సింగ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తాను సామాన్య కూలీనని, రూ. 3,000 చెల్లించడం భారం అవుతుందని వాదించిన ఒక భర్త పిటిషన్‌ను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, పని చేసి తన భార్యను సాకాల్సిన బాధ్యత నుంచి తప్పుకోలేడు అని ధర్మాసనం స్పష్టం చేసింది.