సర్కారు సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది వరకు రాష్ట్రవ్యాప్తంగా బడులన్నీ బంద్

ఉత్తర భారత దేశాన్ని శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో సామాన్య ప్రజలు, విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఈ భీకర చలిని దృష్టిలో ఉంచుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు జనవరి 1వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా గోరఖ్‌పూర్ వీధుల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి.. అర్థరాత్రి వేళ నైట్ షెల్టర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.