Chittoor: దున్నపోతుకు పోలీసుల కాపలా.. చిత్తూరులో అరుదైన ఘటన

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లిలో గ్రామ జాతర సందర్భంగా దున్నపోతు బలిని అధికారులు అడ్డుకున్నారు. గ్రామస్థులు రూ.50 వేలతో కొనుగోలు చేసిన దున్నపోతును బలి ఇవ్వాలని సిద్ధం కాగా, ముగ్గురు యువకులు కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, పోలీసులు రాత్రంతా కాపలా ఉండి జంతుబలి జరగకుండా చర్యలు చేపట్టారు.