Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?

Explained: బెంగాల్‌ అంటేనే మేధావుల ఇలాకా... లౌకికవాదం, లెఫ్ట్ భావజాలం, కళలు, సాహిత్యానికి మారుపేరు. అలాంటి గడ్డపై బీజేపీ అడుగుపెట్టడమే కష్టమనుకున్న తరుణంలో ఊహించని విధంగా ఆ పార్టీ జెండా పాతింది. మొన్నటివరకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో, 294 స్థానాలకు గానూ ఏకంగా 208 సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కేవలం 80 స్థానాలకే పరిమితమైన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చడంలో బెంగాలీ సమాజంలో అత్యంత కీలకమైన 'భద్రలోక్' (విద్యావంతులు, ఉన్నత శ్రేణి మధ్యతరగతి వర్గం) పోషించిన పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌కతా పరిసరాల్లోని ప్రెసిడెన్సీ రీజియన్ అంటే భద్రలోక్‌ల అడ్డా. అలాంటి ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో నాలుగింటిని బీజేపీ గెలుచుకోవడం, రాష్‌బెహారీ లాంటి ప్రతిష్టాత్మక స్థానంలో బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్‌గుప్తా విజయం సాధించడం బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. నిన్నటివరకు హిందుత్వ రాజకీయాలకు ఆమడదూరంలో ఉన్న ఈ వర్గం, హఠాత్తుగా కాషాయ జెండా వైపు ఎందుకు మొగ్గు చూపిందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.