LOC దాటి భారత్‌లోకి చొరబడ్డ పాకిస్తానీ.. రెండు రోజుల్లో రెండో ఘటన!

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు రేఖ ఎల్‌ఓసీ వద్ద ఇటీవల చొరబాట్లు ఎక్కువయ్యాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని వ్యక్తులు ఇటీవల వరుస చొరబాట్లకు యత్నించారు. పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్, కృష్ణ ఘాటి సెక్టార్ ప్రాంతంలో రెండు రోజుల్లో ఇద్దరు చొరబాటుకు యత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని నిఘా సంస్థలకు అప్పగించారు. వరుస చొరబాట్లతో సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.