Mumbai లోకల్‌ ట్రైన్‌లో దారుణం: డోర్ మూసివేసే విషయంలో గొడవ.. యువకుడి హత్య

చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి.. హత్యలకు దారితీసే ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, ముంబయిలో లోకల్ రైల్లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రాత్రి 10.30 గంటల సమయంలో జోరువాన కురవడంతో రైలు బోగీ తలుపు మూసివేత విషయంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఇది ఘర్షణగా మారడంతో ఓ వ్యక్తి.. తన వద్ద ఉన్న కత్తితో యువకుడిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో బాధితుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.