NDSA నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాం: సీఎం రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణను ఎన్‌డీఎస్‌ఏ, కేంద్ర టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సిఫారసుల ప్రకారమే చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజైన్, నిర్మాణ లోపాల వల్ల మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని, ప్రస్తుత స్థితిలో నీటిని నిల్వ చేసి ఎత్తిపోయడం ప్రమాదకరమని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేర్కొందని తెలిపారు. ప్రభుత్వంపై కొందరు బురదజల్లేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెలలో టెస్టింగ్ పూర్తికాగానే, ఐఐటీ ముంబై నిపుణుల సూచనలతో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామన్నారు.