Tamil Nadu: రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి, 60 మందికి అస్వస్థత..

తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకైంది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కలెక్టర్‌.. కార్మికులను పరామర్శించారు. అమ్మోనియా గ్యాస్ లీక్ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.