ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు మరో 17 ఏళ్ల జైలుశిక్ష: పాకిస్థాన్‌లో కోర్టు సంచలనం తీర్పు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రస్థానం మరో కీలక మలుపు తిరిగింది. ఒకవైపు అక్రమ కేసులంటూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న తరుణంలోనే.. అవినీతి కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ శిక్ష కంటే జైలులో ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మా తండ్రిని ఏకాంత ఖైదులో ఉంచి నరకం చూపిస్తున్నారు.. ఆయనకు ప్రాణ గండం ఉంది అంటూ ఇమ్రాన్ కుమారులు చేసిన ఆర్తనాదం అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టిస్తోంది.