ఎయిర్‌పోర్టులకు వేలకోట్లు పెట్టేముందు..ఇదోసారి ఆలోచించండి.. ఏపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సలహా

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏవియేషన్ పాలసీపై రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. కొత్త ఎయిర్ పోర్టుల కోసం వేలకోట్ల రూపాయలు కేటాయించే ముందు ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, ఆధునీకరణపై ఆలోచనలు చేయాలని సూచించారు. అలాగే నూతన ఏవియేషన్ పాలసీకి సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలన అవసరమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలకు అదనంగా మరో 9 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ఏవియేషన్ పాలసీలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.