కేతన్ అగర్వాల్ హత్యకు ఆయన పెట్టుకున్న విగ్గే కారణమా?.. కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే?

పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకు తలపై ఓ చోట జుట్టు లేకపోవడంతో.. విగ్ ధరించేవాడని.. దాని వల్లే సియా గోయల్‌కు అతడిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విగ్ ధరించేవాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఆమె హత్యకు పాల్పడినట్లు పుకార్లు షికార్లు చేస్తుండగా.. తాజాగా కేతన్ అగర్వాల్ తండ్రి స్పందించారు. మెడికల్ కారణాల వల్లే అతడికి జుట్టు లేదని, అయితే ఆ విషయం ముందుగానే సియాకు చెప్పామని పేర్కొన్నారు. తన కుమారుడిని చంపడానికి ఇదే కారణం అని తాను భావించడం లేదని పేర్కొన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.