కోతుల వీరంగంతో మరో మహిళ మృతి.. డాబాపై ఇటుకలు ఉంటే వెంటనే తీసేయండి..

జగిత్యాల జిల్లా ధర్మపురిలో కోతుల వీరంగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఇందిరమ్మ కాలనికి చెందిన కొనపర్తి పద్మ (50) ఇంటి వద్ద ఉండగా, డాబాపై ఆడుకుంటున్న కోతులు కదిలించిన సిమెంట్ ఇటుక కింద పడింది. అది పద్మ తలపై బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల ధర్మపురిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డాబాలపై ఉంచిన ఇటుకలు, నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.