గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి కేసు.. సస్పెండ్ అయిన ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు 42 ఏళ్ల జైలు శిక్ష

సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్ల అమానుషత్వానికి మిజోరం కోర్టు తగిన శాస్తి చేసింది. 2017లో ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌నకు ఒడిగట్టి, ఆపై ఆమెపై యాసిడ్ పోసి దారుణంగా దాడి చేసిన కేసులో ఇద్దరు సస్పెండెడ్ జవాన్లకు ఏకంగా 42 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఐజ్వాల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘోర నేరానికి గానూ వేర్వేరు సెక్షన్ల కింద విధించిన శిక్షలను ఒకదాని తర్వాత ఒకటిగా నిందితులు వరుసగా అనుభవించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.