కెనడాలో 400 కిలోల స్వచ్ఛమైన బంగారం దోపిడీ: భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. ఇండియాలో నిందితుల కోసం వేట

400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా కెనడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన రూ. 160 కోట్లకు పైగా విలువైన గోల్డ్ హీస్ట్‌ కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని వేటాడి పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వెళ్తూ టొరంటో ఎయిర్‌పోర్టులో దిగగానే అరెసలాన్ చౌదరిని బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి, ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు వెల్లడవ్వడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.