గిరిజన సమాజం సంచలన తీర్మానం: 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్లు బంద్.. పెళ్లిళ్లలో బంగారం నిషేధం

రాజస్థాన్‌లోని డూంగర్‌పుర్ జిల్లా సరోదా వేదికగా జరిగిన గిరిజన మహా సమితి ముగింపు వేడుకలు ఒక చారిత్రాత్మక సామాజిక మార్పుకు నాంది పలికాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ యువతను రక్షించుకునేందుకు, సమాజంలో దుబారా ఖర్చులను అరికట్టేందుకు గిరిజన పెద్దలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్స్ నిషేధం, పెళ్లిళ్లలో బంగారం బంద్ చేయాలిన తీర్మానించారు. అంతేకాకుండా వివాహాల్లో కేవలం వెండి ఆభరణాలు మాత్రమే వాడాలని కూడా నిర్ణయించుకున్నారు.